క్యాన్సర్‌ కలవరం | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ కలవరం

Feb 7 2026 3:10 PM | Updated on Feb 7 2026 3:10 PM

క్యాన

క్యాన్సర్‌ కలవరం

క్యాన్సర్‌ సోకుతుందిలా..

న్యూస్‌రీల్‌

గత ప్రభుత్వంలో ఆరోగ్యమే పరమావధిగా..

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం: మారిన జీవనశైలి, ఆహార అలవాట్లతో క్యాన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సర్వైకల్‌, రొమ్ము, నోటి క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి వంద మందిలో ఐదుగురికి పైనే ఆయా క్యాన్సర్ల లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజస్‌ (ఎన్‌సీడీ) సర్వేలో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న పరీక్షతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఎన్‌సీడీ సర్వే : క్యాన్సర్‌ రోగులను గుర్తించి వైద్య సాయం అందించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తోంది. సర్వైకల్‌, రొమ్ము, నోటి క్యాన్సర్‌ పరీక్షలతో పాటు బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ పరీక్షలు ఉచితంగా చేస్తోంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి 18 ఏళ్లు నిండిన వారికి అవసరమైన ఆయా పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 15,12,258 మందికి వైద్య పరీక్షల నిర్వహణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,09,807 మందికి చేశారు. 8,761 మంది బీపీ, 22,995 మంది షుగర్‌, 27,076 మందిలో క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించారు. వీరిలో నోటి క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నవారు 11,496 మంది, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 6,953, సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానితులు 8,627 మంది ఉన్నారు. క్యాన్సర్‌ అనుమానితుల్ని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని అంకాలజీ విభాగానికి సిఫార్సు చేస్తున్నారు. పాజిటివ్‌ లక్షణాలు వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రజలు సహకరించాలి

ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్‌ దశలను గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించే వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. సర్వే సిబ్బందికి మహిళలు తమలో తలెత్తుతున్న లక్షణాలు చెప్పుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు వీలుంటుందని సూచిస్తున్నారు.

మహిళల్లో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లలో వచ్చే మార్పులు రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

కొవ్వు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవడం, జంక్‌ ఫుడ్‌, పోషకాహార లోపం, అబార్షన్‌ కిట్లు, స్టెరాయిడ్ల వాడకం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, తల్లి పాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందంటున్నారు.

30 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ వైరస్‌ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే లక్షణాలు బయటపడతాయి.

30 ఏళ్ల తర్వాత మహిళలు స్క్రీనింగ్‌ చేయించుకోవడం ద్వారా దీని బారి నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు, గుట్కా నమలడం, నోటి పరిశుభ్రత పాటించకపోవడం తదితర కారణాలతో నోటి క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి.

ముందస్తు జాగ్రత్తలే రక్ష

బాధితులను గుర్తించేందుకు కేంద్రం ఎన్‌సీడీ సర్వే

జిల్లాలో 15,12,258 మందికి వైద్య పరీక్షల నిర్వహణ లక్ష్యం

ఇప్పటివరకు 5,09,807 మందికి పరీక్షలు

వారిలో 5.3 శాతం మంది ఓరల్‌, బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ రోగులుగా అనుమానం

తదుపరి పరీక్షల కోసం ఏలూరు జనరల్‌ ఆస్పత్రికి సిఫార్సు

చిన్న పరీక్ష.. పెద్ద రక్ష అంటున్న వైద్యులు

ప్రజావైద్యానికి పెద్దపీట వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అమలుచేసిన విషయం విదితమే. బీపీ, షుగర్‌, హెపటైటీస్‌–బి, హిమోగ్లోబిన్‌, మలేరియా, హెచ్‌ఐవీ, డెంగ్యూ, విజువల్‌ ఇన్ఫెక్షన్‌, తదితర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వేలో 14 రకాల వైద్య పరీక్షలు చేసేవారు. హెల్త్‌ డైరీ రూపొందించి ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్‌ వైద్యులతో వైద్యసేవలు, మందులు అందజేసేవారు. 172 రకాల మందులను అందుబాటులో ఉంచి నడవలేని వారు, దీర్ఘ్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు, ఆరోగ్య సిబ్బంది మందులు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇలా జిల్లాలో కేవలం రెండు విడతల్లో ఐదు లక్షల మందికి పైగా రోగులకు సేవలు అందించారు.

క్యాన్సర్‌ కలవరం 1
1/2

క్యాన్సర్‌ కలవరం

క్యాన్సర్‌ కలవరం 2
2/2

క్యాన్సర్‌ కలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement