ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

Feb 7 2026 3:10 PM | Updated on Feb 7 2026 3:10 PM

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

కామవరపుకోట: పోలీస్‌ సిబ్బంది ఫైరింగ్‌లో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ సూచించారు. వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పురస్కరించుకుని తడికలపూడిలో గురువారం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వల్ల పోలీసు సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, దీని కోసం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ను వినియోగించుకుని వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో అన్ని సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు శిక్షణకు హాజరయ్యారు. ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్‌ అదనపు ఎస్పీ జి.మునిరాజా పాల్గొన్నారు.

నేర సమీక్షా సమావేశం

ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement