వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
● చంద్రబాబు పాలనపై విసుగు చెందిన కూటమి నేతలు
● వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ, జనసేన నాయకులు
కుక్కునూరు: చంద్రబాబు ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు ఆయా పార్టీలను వీడుతున్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీలో చేరికలు భారీగా జరిగాయి. కుక్కునూరు మండలం గణపవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు టి.శేషుకుమార్, జి.మోహన్‌రావుకు వైఎస్సార్‌సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే మాధవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక తిరుపతిరావు, సున్నం బాబురావు, మల్లం సత్యం, సున్నం వీరభద్రం, తుర్సం రాఘవయ్య, సారంగి కృష్ణ వైఎస్సార్‌సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు చేకూరి నవీన్‌వర్మ, గ్రామ కన్వీనర్ గంజిశ్రీను, కుండా అశోక్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
కామవరపుకోటలో..
కామవరపుకోట: కామవరపుకోటలోని కొండగూడెంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరినట్టు మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు వారికి కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. యాదవుల కాలనీలో దొడ్డకుల చెన్నారావు, ములకాల అశోక్, ములకాల నాగార్జున, పాత కొండగూడెంలో మల్లెల్లి రాఖీ, గూట్ల నాని, బండి చిన్న, గుడిపూడి నంది రాజు, ఆడమిల్లి చక్రవర్తి, కూసుమీ బాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా ఎ లాంటి గుర్తింపు లేకపోగా, తమ ప్రాంతానికి ఎ లాంటి మంచి జరగలేదని వారు అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులతో ఇమడలేక వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.
పాలకొల్లులో..
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూటమి పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారంటే పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి అన్నారు. పాలకొల్లులో జరిగిన కా ర్యక్రమంలో జనసేన, టీడీపీకి చెందిన పది మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి గోపి పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అందరికీ గుర్తుందన్నారు. అబద్ధాలతో చంద్రబాబు మోసం చేసిన విషయం ప్రజలు ఇప్పడిప్పుడే గ్రహిస్తున్నారన్నారు. మజ్జి ప్రసాద్, తాడి సింహాచలం, తాడి శ్రీను తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే జోగాడ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, వీరా మల్లికార్జునుడు, శంకరాపు శ్రీను పాల్గొన్నారు.
కుక్కునూరు: కండువా వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
పాలకొల్లు సెంట్రల్: కండువా వేసి ఆహ్వానిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి
వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు


