సహకార ఉద్యోగుల సమస్యలు పట్టవా?
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్ హె చ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసి) పిలుపులో భాగంగా సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలన్నారు. సొసైటీ ఉద్యోగులకు జీఓ 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ, సిబ్బందిని కుదించే ఆలోచనలు మానుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా యూనియన్ నాయకులు కేవీవీ సత్యనారాయణ, టి.గంగరాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డీసీసీబీ, ఆప్కాబ్ తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐటీయూ నాయకులు సీహెచ్ సుందరయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


