18 రోజులు.. రూ.1.75 కోట్లు
చినవెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని స్థానిక ప్ర మోద కల్యాణ మండపంలో సోమవారం లె క్కించారు. శ్రీవారికి విశేష ఆదాయం సమకూ రింది. గత 18 రోజులకు గాను నగదు రూపేణా రూ.1,75,47,176 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 138 గ్రాముల బంగారం, 4.574 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.500, రూ.2,000 నోట్ల ద్వారా రూ.1,13,000 లభించాయన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా వినతులు స్వీకరించిన అనంతరం పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కా రం చూపాలన్నారు. పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భీమవరం: ప్రభుత్వ ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు గోదావరి క్రీడా ఉత్సవాలు జిల్లాస్థాయిలో ఈనెల 27, 28 తేదీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి గోదావరి క్రీడోత్సవాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. డివిజన్ స్థాయి పోటీల్లో విజేతలు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, షాట్‌పుట్ తదితర 9 రకాల పోటీలు నిర్వహిస్తామని, క్రీడాకారులు మంగళవారంలోపు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
భీమవరం: రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే వారికి నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహరీ వాజ్‌పేయి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం భీమవరంలో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బైక్ ర్యాలీ, వాజ్‌పేయి విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి స్ఫూర్తితో తాను పనిచేస్తున్నానన్నారు. కేంద్ర ఉక్కు, భా రీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రా జు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రాజకీయాల్లో వి లువలు కలిగిన నేత వాజ్‌పేయి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లా డుతూ భీమవరంలో 9 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తామన్నారు.
18 రోజులు.. రూ.1.75 కోట్లు


