‘కౌశల్’ విజేతలకు బహుమతులు
భీమవరం: భీమవరం ఏఆర్‌కేఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ అప్ కాస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్– 2025 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో 12 మంది విద్యార్థులు విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ ప్రశంసా పత్రాలు, జ్ఞాపిక, నగదు పురస్కారాలను అందజేశారు. కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ జిల్లాలో విజేతలైన విద్యార్థులు ఈనెల 27వ తేదీన తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కౌశల్ జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ జి శ్రీనివాస వర్మ, టెక్నికల్ కోఆర్డినేటర్ ఏసీ వరప్రకాష్, డీసీఈబీ సెక్రెటరీ జీవీవీ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి వి పూర్ణచంద్రరావు, అప్ కాస్ట్ జిల్లా సమన్వయ అధికారి మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


