పారా గేమ్స్‌లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్–2025లో జంగారెడ్డిగూడెంకు చెందిన బుడిగిన రవి కార్తీక్ ఆరు పతకాలు సాధించారు. బుధవారం స్థానిక సాయిబాలాజీ టౌన్ షిప్‌లో రవి కార్తీక్, తండ్రి నాగేంద్ర కుమార్ వివరాలు వెల్లడించారు. స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్, బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల ఐఎం విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, 50, 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రో విభాగాల్లో వెండి పతకాలను రవికార్తీక్ సాధించాడన్నారు.
పెనుగొండ: సిద్ధాంతం గోదావరిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడి మృత్యువాత పడ్డాడు. పెరవలి మండలం పిట్టవేమవరంనకు చెందిన పడాల రఘునాథరెడ్డి (35) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ సొంత గ్రామానికి సెలవుల నిమిత్తం వచ్చారు. స్నేహితులతో కలసి మంగళవారం సాయంత్రం సిద్ధాంతం బ్రిడ్జి వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని గోదావరి ఒడ్డుకు వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. జాలర్ల సహాయంతో వెతకగా మృతదేహం లభించింది. మృతుడి సోదరుడు పడాల ఫణీంద్ర పెనుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై కే గంగాధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రఘునాథరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.


