డ్వాక్రా మహిళల ఆందోళన
ఆకివీడు: నష్టపోయిన డ్వాక్రా బాధితులు తమకు న్యాయం చేయాలని యూనియన్ బ్యాంక్‌కు క్యూ కడుతున్నారు. స్థానిక సంతపేట, సమతానగర్ ప్రాంతంలోని యానిమేటర్లు డ్వాక్రా మహిహిళల సొమ్ము కొట్టేశారు. విషయం తెలుసుకున్న ఆయా సంఘాల మహిళలు బ్యాంకుల వద్ద పడుగాపులు పడుతున్నారు. యానిమేటర్ల ఇంటికి వెళ్లి ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. మంగళవారం స్థానిక సమతానగర్‌లోని యానిమేటర్ ఇంటికి వెళ్లి ఆందోళన చేస్తుండగా ఆమె పోలీస్‌స్టేషన్‌కు పరారయ్యారని మహిళలు పేర్కొన్నారు. స్థానిక యూనియన్ బ్యాంకు విజిలెన్స్ అధికారి గంగాధరరావు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 32 గ్రూపులకు చెందిన డ్వాక్రా సంఘాల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఫిర్యాదుల మేర విచారణ చేస్తున్నామని చెప్పారు.


