చైన్ స్నాచర్‌ల అరెస్ట్
ముదినేపల్లి రూరల్: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ఏలూరు డీఎస్పీ డి శ్రావణకుమార్ స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మత్స వెంకటేష్, పటాస్ సలీంబాషా కలిసి మండలంలోని వడాలి, పెయ్యేరు, గురజ గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై వెళుతూ మహిళల మెడల్లోని గొలుసులు తెంపుకుపోయారన్నారు. వీరిని కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తు 6.5 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో మత్స వెంకటేష్‌పై 18 కేసులు, సలీంబాషాపై 9 కేసులు ఉన్నాయన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ రవికుమార్‌తో పాటు ఎస్సై వీఎస్ వీరభద్రరావు, కానిస్టేబుళ్లు బి పెద్దిరాజు, బి నాగబాబు, ఎ నాగరాజు, బి పవన్‌కుమార్, జి శివకోటయ్యలను ఎస్పీ అభినందించినట్లు చెప్పారు.


