బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. మండలంలోని నాగులగూడెం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై మారుటి తండ్రి బోడ రవి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. గత మూడు నెలలుగా తల్లి లేని సమయంలో బాలికపై మారు తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడుతూ, ఎవరికై నా చెబితే చంపుతానని బెదిరించాడన్నారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లి, మేనమామ సోమవారం ఫిర్యాదు చేయడంతో లక్కవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి విచారణ చేశామన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై జబీర్, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేస్తుండగా, స్థానిక రామచంద్రాపురం సాయిబాబ స్థూపం వద్ద నిందితుడు బోడ రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,53,844 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. భక్తులు 2,227 మంది స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్


