హ్యాకథాన్ పోటీల్లో ఎస్‌ఆర్‌కేఆర్ విజయకేతనం
భీమవరం: కేంద్ర ప్రభుత్వం, ఏఐసీటీఈ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్ వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో రెండు విభాగాల్లో ఎస్‌ఆర్‌కేఆర్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కర్సపాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. ఒక్కొక్క టీం రూ.75 వేల నగదు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రూ.25 వేల నగదు బహుమతిని సాధించారన్నారు. అనధికారికంగా విద్యుత్ తీగలతో వేసిన ఫినిషింగ్‌ను డిటెక్ట్ చేసే విధానాన్ని హార్డ్‌వేర్ రూపంలో రూపొందించారని, అలాగే రెన్యుబుల్ ఎనర్జీ ద్వారా పవర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ అనే అంశాలపై రూపొందించిన హార్డ్‌వేర్ ప్రాజెక్టుకు కేరళ ప్రభుత్వం రూ.75 వేలు నగదు అందించిందన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో మంగళవారం విజేతలను నిశాంత్ వర్మ, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ఎస్‌ఎస్ మోహన్‌రెడ్డి, బీఆర్‌కె వర్మ, పి.రవికిరణ్‌వర్మ, సీహెచ్ దిలీప్ చక్రవర్తి, ఎన్ గోపాలకృష్ణమూర్తి తదితరులు అభినందించారు.


