గంట సేపు నిలిచిన ప్యాసింజర్
ఆకివీడు: నర్సాపురం నుంచి చైన్నె వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ఆకివీడు రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలును సుమారు గంటసేపు ఆపారు. భీమవరం నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ రైలు ఇటీవల సకాలంలో గమ్యానికి చేరుతుంది. అయితే సోమవారం వందేభారత్ రైలు కోసం ప్యాసింజర్ రైలును గంటపైగా ఆపడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం సమీపంలో యనమదుర్రు డ్రైన్ నుంచి పంట పొలాలకు నీరు తోడే తూములో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ ప్రభాకర్ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్స్ కలిసి రెండు గంటల శ్రమించి 12 అడుగుల భారీ కొండ చిలువను పట్టుకున్నారు. భీమవరం రేంజ్ అటవీ శాఖ అధికారి ఎం.కరుణాకర్ మాట్లాడుతూ కొండచిలువ 12 అడుగుల పొడవు 80 కిలోల బరువు ఉందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్‌కు కొండచిలువను తరలించినట్లు ఆయన తెలిపారు.
గంట సేపు నిలిచిన ప్యాసింజర్


