రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
పెదవేగి: రాట్నాలమ్మ దేవస్థానం భక్తులతో కళకలలాడింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మకు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ వారం పూజా రుసుం వల్ల రూ.35,980, విరాళంపై రూ.1,664, లడ్డూ ప్రసాదంపై రూ.18,945, ఫోటోల అమ్మకంపై రూ.1,445 , మొత్తం రూ.58,034 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ గుబ్బల మంగమ్మ తల్లిని పూలతో ప్రత్యేక అలంకరణ చేయగా.. భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. చలికాలం అయినప్పటికీ మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
ఏలూరు టౌన్: ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని నిత్య డార్మిటరీలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టూటౌన్ ఇన్‌చార్జ్ సీఐ, నగర ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి చేశారు. ఆదివారం సాయంత్రం పోలీసులు చేసిన దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.52,233 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును డార్మిటరీ బాత్‌రూమ్‌లో పేకాటరాయుళ్ళు దాచే ప్రయత్నం చేయగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు.
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు


