భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్‌బీ దోహదం
● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్‌బీ సెమీఫైనల్స్
● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులు
రాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్‌బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది.
కేటగిరీలుగా విభజించి..
కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్‌బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్‌రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్‌బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్‌గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది.
స్పెల్‌బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్‌పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్‌తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా.
–ఎన్‌ఎస్‌ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, దిప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం
విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్‌లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి.
–డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్‌బీ పరీక్ష దోహదపడుతుంది. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్‌లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
–డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం
స్పెల్‌బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్‌లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా స్పెల్‌బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది.
–వి.రాజేష్, కో–ఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్
‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్‌కు బాటలు వేస్తోంది.
–వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం
ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది.
–గారపాటి రుద్రనాగ్ చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది.
–కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. –పెన్మెత్స సాత్విక,
8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం
‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. –కఠారి చరిష్మా,
9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం
నేను ముందుగా స్పెల్‌బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్‌బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్‌లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. –దాట్ల దీక్షిత, 7వ తరగతి
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా


