కోటి సంతకాల ఉద్యమానికి తరలిరావాలి
గణపవరం: మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలంతా తరలిరావాలని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 15 సోమవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరులో పెద్ద రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాల బండిల్స్ ర్యాలీగా గన్‌బజార్, ఫ్‌లై ఓవర్ వంతెన మీదుగా తాడేపల్లికి తరలిస్తారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అఽధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, అన్ని నియోజకవర్గాల కన్వీనర్‌లు, పార్టీ ప్రముఖులు పాల్గొంటారని ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులంతా ఏలూరు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. అమ్మవారిని సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రూ.52,355 ఆదాయం వచ్చిందని ఈవో చెప్పారు.
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని జరిపించినట్లు ఆలయ ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.
కోటి సంతకాల ఉద్యమానికి తరలిరావాలి
కోటి సంతకాల ఉద్యమానికి తరలిరావాలి


