కోటి సంతకాలే ప్రజాగ్రహానికి నిదర్శనం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు
జంగారెడ్డిగూడెం: సీఎం చంద్రబాబుపై ప్రజాగ్రహానికి కోటి సంతకాలే నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు కార్పొరేట్ జపం చేస్తూ రాష్ట్రాన్ని ప్రైవేట్‌వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. అదే రీతిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందన్నారు.కోటి సంతకాల సేకరణలో పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసిన ప్రజలకు గురునాథరావు కృతజ్ఞతలు తెలిపారు.


