ఏఓ శ్రీనివాస్‌పై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఏఓ శ్రీనివాస్‌పై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

Dec 12 2025 6:00 AM | Updated on Dec 12 2025 6:00 AM

ఏఓ శ్రీనివాస్‌పై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

ఏఓ శ్రీనివాస్‌పై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

ఏఓ శ్రీనివాస్‌పై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి జీసీసీ డిపోల్లో అమ్మకాలు పెరగాలి

పెనుగొండ: విచారణల పేరుతో రికార్డులను దౌర్జన్యంగా డీఎల్‌పీఓ కార్యాలయానికి తీసుకెళ్లి దళిత సర్పంచ్‌లను వేధిస్తున్న ఏఓ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొడమంచిలి సర్పంచ్‌ సుంకర సీతారామ్‌, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కోట వెంకటేశ్వరరావులు ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం విజయవాడలోని ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర కార్యదర్శికి ఫిర్యాదును అందించారు. పంచాయతీ రికార్డులను, ఓచర్లను తీసుకెళ్లి ఓచర్లు తారుమారు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీతారామ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో దళిత సర్పంచ్‌లను టార్గేట్‌ చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపారన్నారు. టీడీపీ నాయకుడు రాంబాబు చేస్తున్న ఇసుక అక్రమ దందాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారులను బెదిరించి కొడమంచిలి, ఆచంట, పండిత విల్లూరు, జగన్నాథపురం, మార్టేరు తదితర పంచాయతీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే రికార్డులు తారుమారు చేసి వేధింపులకు గురిచేస్తున్న మాజీ సర్పంచ్‌ సీహెచ్‌ శ్రీను, బి.వెంకట రమణ, రాంబాబు, ఏఓ శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

యలమంచిలి: మండలంలోని ఏనుగువానిలంక గ్రామానికి చెందిన మందా ఏసురాజు (41) ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని స్నేహితుడు పాలపర్తి సుధాకర్‌ చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదికి స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ ఏసురాజు నీటిలో మునిగిపోయాడు. వెంటనే సుధాకర్‌ ఇంటికి వెళ్లి ఏసురాజు కుటుంబ సభ్యులకు ప్రమాద విషయం తెలిపాడు. దీంతో ఏసురాజు భార్య స్వరూపరాణి పోలీసులకు ఫిర్యాదు అప్పటి నుంచి గాలించగా గురువారం చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో నిర్మాణంలో ఉన్న రైలు వంతెన సమీపంలో ఏసురాజు మృతదేహం పైకి తేలింది. దీంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు.

బుట్టాయగూడెం: జీసీసీ సేల్స్‌ డిపోల్లో ఏడాదికి ఇచ్చిన టార్గెట్‌ను సేల్స్‌మెన్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్‌ అన్నారు. మండలంలోని కేఆర్‌పురం జీసీసీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జీసీసీ పరిధిలో ఉన్న 26 మంది సేల్స్‌మెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ నిత్యవసర సరుకులు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను పెంచాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement