ఉత్సాహంగా లేగ దూడల అందాల పోటీలు
వీరవాసరం: తరచూ శీతకాలంలో చూడు కట్టని పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తామని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఆర్.కోటలింగరాజు అన్నారు. గురువారం కొణితివాడ వెటర్నరీ పశువుల ఆసుపత్రి వద్ద రాష్ట్ర గోకుల్ మిషన్ క్యాంపులో కేంద్ర ,రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రస్తుగణభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చూడు కట్టని పశువులకు గర్భస్థ పరీక్షలు, లేగ దూడల అందాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోటలింగరాజు మాట్లాడుతూ పశువులు దీర్ఘకాలికంగా చూడు కట్టని, గర్భస్వావంతో బాధపడే పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా లేగ దూడల పోషణ సౌకర్యం , ఎదుగుదల ఉన్న దూడలకు అందాల పోటీలు నిర్వహించి గెలుపొందిన యజమానికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వెటర్నరీ అధికారి బి.వరలక్ష్మి మాట్లాడుతూ 40 పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి యజమానులకు మందులను అందించినట్లు తెలిపారు. లేగ దూడల ప్రదర్శనలో మొదటి బహుమతి నాగరాజు, రెండో బహుమతి వాడపల్లి సుబ్బరాజు, మూడో బహుమతి యరకరాజు సత్య హరిహర రాజు పొందారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎల్‌కే సుధాకర్, డాక్టర్ జావన్ హుస్సేన్, పెనుమంట్ర వెటర్నరీ డాక్టర్ జి.రవికాంత్ పాల్గొన్నారు.


