చెదిరిపోతున్న మెడిసిన్ కల
ఎంత కష్టపడైనా సరే తమ పిల్లలను బాగా చదివించుకోవాలని అనుకుంటారు. మెడిసిన్ చదవాలనుకుంటున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు కల ప్రైవేటీకరణ వల్ల మధ్యలోనే చెదిరిపోతుంది. ఆర్థిక స్తోమత లేక చదువు ఆగిపోతుంది. ప్రభుత్వ కళాశాలల్లో అయితే మెరిట్ విద్యార్థులు సీటు సాధించుకోగలుగుతారు.
– జుత్తుగ సీతామహాలక్ష్మీ, గృహిణి, పాలకొల్లు
చంద్రబాబు ప్రభుత్వం స్వార్థం కోసమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ హయాంలో నిర్మించిన 17 మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం అయితే పేద ప్రజలు వైద్య విద్య చదువుకోవడం కలగానే మిగిలిపోతుంది. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఫీజులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
– నిడుమోలు ఉమామహేశ్వరరావు, నరసాపురం
మెడికల్ కళాశాలలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకున్నట్లు అవుతుంది. పేదలకు ఉచిత వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. పేద, మధ్య తరగతి వైద్య విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు తక్కువ ఫీజుతో వైద్య విద్యను అందిస్తాయి.
– ఆర్‌సీవీ రాజు, సింగరేణి కాలరీస్ రిటైర్డ్ జనరల్ మేనేజర్, నరసాపురం
చెదిరిపోతున్న మెడిసిన్ కల
చెదిరిపోతున్న మెడిసిన్ కల


