బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
బుట్టాయగూడెం: స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు విలువ గల ఎలక్ట్రికల్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బుట్టాయగూడెం మండలంలోని సుమారు 25 బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల పరిధిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అనంతరం సేవల పునరుద్ధరణకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో కాలిపోయిన పరికరాలను ఆర్‌జీఎమ్, ఏజీఎంతోపాటు ఇతర అధికారులు పరిశీలించారు.
రూ. 3 లక్షలు విలువ గల ఎలక్ట్రానిక్స్ పరికరాలు దగ్ధం


