మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో సుమారు 2,295 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే స్వామి వారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.2,20,160 ఆదాయం వచ్చిందన్నారు.
సామర్లకోట: జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్‌లో సామర్లకోటకు చెందిన యాతం నాగబాబు 3 పతకాలు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆది, సోమవారాల్లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో 1,500 మీటర్ల పరుగులో ఒక రజతం, 800, 400 మీటర్ల పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1,254 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి ఈ ఏడాది వరకూ జరిగిన వివిధ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ పరుగు పందెంలో 100, 200, 400, 800, 1,500 మీటర్లతో పాటు రిలే విభాగాల్లో 68 పతకాలు సాధించానని వివరించారు. వీటిలో 20 బంగారు, 23 రజత, 25 కాంస్య పతకాలున్నాయని తెలిపారు. 55 ఏళ్ల వయస్సులోను పతకాలు సాధిస్తున్న నాగబాబును పలువురు అభినందించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్య, ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో పని చేస్తున్నారు.
మద్ది క్షేత్రంలో విశేష పూజలు


