టెట్ సందేహాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): టెట్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన సందేహాలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చన్నారు. అవసరమైన వారు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ 90523 91111, 95056 44555, 96036 57499 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో విశేష సేవలు అందించిన ఆచార్యులు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌శర్మ చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు. ఏపీ నిట్‌లో ఎంఎంఈ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్ రఫీ మహమ్మద్ ఐఐఎంలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ స్టూడెంట్స్ అప్లియేటెడ్ చాప్టర్ అవార్డును అందుకున్నారు. ఇదే విభాగానికి చెందిన విద్యార్థిని జయస్మితా కె.ప్రతాన్ బెస్ట్ స్టూడెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ గుగులోతు సంతోష్ కుమార్ ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ ఎక్స్‌లెన్సీ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతలను నిట్ ఇన్‌చార్జి, రిజిస్ట్రార్ అభినందించారు.


