విద్యార్థినులపై లైంగిక వేధింపులు
భీమవరం అర్బన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు వికృత చేష్టలకు పాల్పడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఉండి, భీమవరంలో కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటనలు మరువక ముందే మండలంలోని గొల్లవానితిప్ప జెడ్పీ హైస్కూల్‌లో మరో ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. గొల్లవానితిప్ప హైస్కూల్‌లో 192 విద్యార్థులు ఉండగా వారిలో 106 మంది విద్యార్థినులే. 9,10 తరగతులకు గణితం బోధించే ఉపాధ్యాయుడు బోడ సుధీర్‌బాబు గత 27 రోజుల క్రితం తరగతి గదిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. విషయాన్ని తల్లిదండ్రులు హెచ్‌ఎం మల్లికార్జునరావు దృష్టికి తీసుకువెళ్లగా అప్పటినుంచి సుధీర్‌బాబు విధులకు హాజరు కా వడం లేదు. అయితే ఈ విషయాన్ని జనసేన నాయకులు గుట్టుగా రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సుఽధీర్‌బాబుపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చిల్లే వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు డీవైఈఓకు వినతిపత్రం అందించారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో తల్లిదండ్రులు ఈ విషయాన్ని లేవనెత్తారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఈనెల 6న నివేదిక అందించడంతో సోమవారం ఉపాధ్యాయుడు సుధీర్‌బాబును సస్పెండ్ చేసినట్టు డీవైఈఓ రమేష్ తెలిపారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్


