గళమెత్తిన సహకార ఉద్యోగులు
భీమవరం: రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూ నియన్ జేఏసీ పిలుపు మేరకు భీమవరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాం మెయిన్ బ్రాంచ్ వద్ద సో మవారం ఉద్యోగులు ధర్నా చేశారు. యూనియన్ నాయకులు నందమూరి సుబ్బారావు, ఎస్.వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, వేతన సవరణ కమిటీ వేయాలని, చట్టం ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019 తరువాత నియమించిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. అనంతరం డీసీసీబీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ దు ర్గారావుకు వినతిపత్రాలు అందజేశారు. ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో డీసీసీబీ బ్రాంచీల వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. యలమంచిలి, వీరవాసరం, తణకు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఆయా కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు.


