టీడీపీ నేతల శంకుస్థాపనపై ఫిర్యాదు
ద్వారకాతిరుమల: కొందరు టీడీపీ నాయకులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై వైఎస్సార్‌సీపీకి చెందిన సత్తాల సర్పంచ్ కొండాబత్తుల సుభద్ర సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సండ్రకుంటలో గత శనివారం ఎంపీడీవో పీవీవీ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి సందీప్‌ల సమక్షంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, మరికొందరు పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, తనకు ముందు రోజు రాత్రి మొక్కుబడిగా ఫోన్ చేసి ఆహ్వానం పలికారని, ఎంపీపీ బొండాడ మోహినీ వెంకన్నబాబుకు గాని, వార్డు సభ్యులకు గాని కనీసం సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బలహీన వర్గానికి చెందిన సర్పంచ్‌ని కావడం వల్లే ఇలా చేశారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ ఎంపీడీవో, పంచాయితీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణ జరపాలని డీపీఓని ఆదేశించినట్టు సర్పంచ్ తెలిపారు.
గ్రామసభ ద్వారానే స్థలాన్ని నిర్ణయించాలన్న జేసీ


