రావిపాడులో వైద్య శిబిరం
పెంటపాడు: సాక్షి పత్రికలో శనివారం ప్రచురితమైన శ్రీపారిశుద్ధ్యం ఇలా.. ఆరోగ్యం ఎలాశ్రీ వార్తకు ఽఅధికారులు స్పందించారు. ముదునూరు వైద్యాధికారులు పూజిత, పవన్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ పెన్నాడ సూరిబాబు ఇంటి వద్ద పెన్నాడ, తోట వారి వీధుల్లో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. డ్రెయినేజీ నీటితో కలుషితమైన తాగునీటిని తాగొద్దని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటి వైద్య సర్వే కోసం 4 బృందాలను పంపించారు.
రావిపాడులో వైద్య శిబిరం


