బైకులను ఢీకొన్న లారీ
కొయ్యలగూడెం: మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ పలు బైకులను ఢీకొట్టడంతో వాహనదారులు కొందరు గాయపడ్డాడు. ఆదివారం రాత్రి జాతీయ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మార్జిన్ పక్కన పార్కింగ్ చేసి ఉండగా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సుమారు 10 మోటార్ బైకులు, స్కూటీల మీదుగా లారీ దూసుకుపోయింది. బైక్, స్కూటీలపై ఉన్న వాహనదారులు పలువురు గాయపడ్డాడు. వారిని సమీపంలోని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.
వీరవాసరం: ఈ నెల 27న హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఈత పోటీలకు వీరవాసరం మండలానికి చెందిన కోరశిఖ జ్యోత్స్న ఎంపికై నట్లు ఆమె తండ్రి వీర్రాజు ఆదివారం తెలిపారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధర్యంలో నరసారావుపేటలో 7న నిర్వహించిన వాటర్ పోల్‌లో పాల్గొని ఆమె అర్హత సాధించనట్టు తెలిపారు.
బైకులను ఢీకొన్న లారీ


