బకాయిలు వెంటనే చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డెమోక్రటిక్ పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డెమోక్రటిక్ పీఆర్‌టీయూ కార్యాలయంలో ఏలూరు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తలపంటి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శిగా శేషపు శ్రీనివాసు, కోశాధికారిగా ఎన్‌వీకే వీరబాబు, జిల్లా కేంద్రం అధ్యక్షుడిగా రెడ్డి నాగ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతి సందీప్, రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి సూర్యచంద్రరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్.నాగేంద్ర సింగ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా గుంపిన గోపి కిషోర్ ఎంపికయ్యారు.


