ఆందోళన అవసరం లేదు
స్క్రబ్ టైఫస్ వ్యాధి బాధితులు ఆయా లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాణాపాయం లేదు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఏడు రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. జ్వరం, తలనొప్పి, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరిలో మాత్రమే శ్వాసకోశ ఇబ్బందులు, కిడ్నీ సమస్యలు, లివర్ దెబ్బతినటం వంటి తీవ్ర అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెట్లు, పొదలు ఉండే ప్రాంతంలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు వంటివి పాటించాలి.
– డాక్టర్ కీర్తి ప్రియాంక, జనరల్ మెడిసిన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఏలూరు జీజీహెచ్


