పేదల బతుకుల్లో చెత్త పోస్తారా?
నరసాపురం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగుంటపాలెంలో 8 వేల మందికి జగన న్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తే.. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చెత్తను డంప్ చేయాలని నిర్ణయించడం దారుణమని వైఎస్సార్‌సీపీ నరసాపురం పట్టణ అధ్యక్షుడు కామన బుజ్జి ధ్వజమెత్తారు. పేదల బతుకుల్లో చెత్తను పోసే దారుణానికి ఎలా ఒడిగట్టారని ప్రశ్నించారు. నరసాపురం ము న్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ, వైఎస్సార్‌సీపీ సభ్యుల నిర్బంధం తరువాత శనివారం రాత్రి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ జగనన్న కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారని, కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చె ప్పారు. అక్కడ మౌలిక వసతులు, పెండింగ్ పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదన్నారు. అది చేయకుండా అక్కడ చెత్తను వేయాలని చూడటం జగన్ సంకల్పాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల బతుకులు బాగుచేయాలని అన్నారు.
కౌన్సిల్ చరిత్రలో చీకటి రోజు
బయట గేట్‌కు తాళాలు వేసి తమను గంటల తరబడి మున్సిపల్ కార్యాలయంలో నిర్బంధించడం దారుణమని మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ అన్నారు. కౌన్సిల్‌లో వారు సంతకం పెట్టమ న్న అంశంపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నా వినకుండా దారుణంగా ప్రవర్తించారని వి మర్శించారు. కౌన్సిలర్ భర్త అయిన మున్సిపల్ కా ంట్రాక్టర్ వద్దకు మున్సిపల్ కార్యాలయం తాళాలు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. అసలు తాళం వేయడానికి అతనెవరని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాద న్నారు. నరసాపురం చరిత్రలో ఇది చీకటి రోజన్నారు.
దాడికి తెగబడ్డారు
వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని మాట్లాడుతూ అతికష్టం మీద నిర్బంధాన్ని దాటుకుని వచ్చిన తరువా త బయట కూడా తమపై దాడికి తెగబడ్డారన్నారు. కౌన్సిలర్ సఖినేటిపల్లి మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశానికి వస్తే, మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్బంధంలో ఉంచారన్నారు. 30 వ వార్డు కౌన్సిలర్ అడిదల శ్యామల మాట్లాడుతూ మహిళా చైర్‌పర్సన్ అని చూడకుండా, చైర్‌లో ఉన్న ఆమె మీదకు వెళ్లి మినిట్స్ బుక్‌పై సంతకం పెట్టా లని బెదిరించారన్నారు. తాము నిర్బంధంలో మలమల మాడిపోతూ భయపడుతూ ఆందోళనలో ఉంటే బయట వారు అధికార పార్టీ అండతో టిఫిన్‌లు తింటూ, మమ్మల్ని హేళన చేస్తూ నీచంగా ప్రవర్తించారని మహిళా కౌన్సిలర్లు సిర్రా కాంతమ్మ, పతివడ పద్మ, సోమరాజు దుర్గాభవానీ, యర్రా లక్ష్మి ఆ గ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు బర్రి జయరాజు, కావలి రామసీత, బొంతు రాజశేఖర్, వంగా శ్రీకాంత్ కన్నాచ బుడితి తిలీప్, ద్వారా ప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం


