వైద్య కళాశాలల ప్రైవేటీకరణను సహించం
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ఇరగవరం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ను సహించబోమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రేలంగిలో శనివారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భా గంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏ ముఖ్యమంత్రీ తీసుకురాలేదని, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే తన హయాంలో 17 మెడికల్ వైద్య కళాశాలలను తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. అటువంటి కాలేజీలను నిర్వహించలేక చంద్రబాబు సర్కారు చేతులెత్తేయడమే కాకుండా ప్రైవేటీకరణ చేసి పేదలను ప్రైవేటు వైద్యం వైపు మళ్లించాలని చూస్తోందని మండిపడ్డారు. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుచేసి వాటి ద్వారా ఖరీదైన వైద్యంగా పరిగణించే కిడ్నీ, లివర్, గుండె తదితర శస్త్రచికిత్సలు పేదలకు ఉచితంగా అందించాలని, వైద్య విద్యను కూడా పేదలకు ఉచి తంగా వైద్య కళాశాలల ద్వారా అందించవచ్చని జ గన్‌మోహన్‌రెడ్డి కలలుగన్నారని కారుమూరి చెప్పా రు. ఏదేమైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలనే తమ నినాదంతో ఎంతవరకు అయినా వెళ్తామని ఆయన తేల్చిచెప్పారు.
వెల్లువలా సంతకాల సేకరణ
గ్రామంలో చీకటి పడినా సంతకాల కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎక్కడ శిబిరం పెట్టినా ప్రజలు వెల్లువగా వచ్చి సంతకాలు చేస్తున్నారని కారుమూరి అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, నాయకులు పెన్మెత్స సుబ్బరాజు, పులుపు అనిల్, మాజీ సర్పంచ్ మైనం పాము, నడుంపల్లి రామారాజు, మెట్ల డాడి, చేబ్రోలు పెద్దిరాజు, మోషే, సబ్బితి రాజేష్, తాతపూడి బోస్ తదితరులు పాల్గొన్నారు.


