మంత్రి నిమ్మల వేధింపుల పర్వం
న్యూస్‌రీల్
మంత్రి ప్రోద్బలంతోనే సీఐడీ కేసు
హోటళ్లకు ఫుల్ డిమాండ్
సంక్రాంతి పండుగ నాలుగు రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండటానికి హోటళ్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. దీంతో హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 8లో u
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది. జరగని గొడవను జరిగినట్టుగా చిత్రీకరించి నానా హంగామా చేసి చివరికి అనుచరుడితో కేసు పెట్టించి పరపతిని ఉపయోగించి కేసును సీఐడీకి అప్పగించారు. కట్ చేస్తే.. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు ఒక్కొక్కరిని సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. 2022లో టిడ్కో ఇళ్ళ గృహ ప్రవేశాల సందర్భంగా జరిగిన ఘటనను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నిమ్మల కక్షతీర్చుకునేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి రోజుకొకరిని రాజమండ్రి సీఐడీ ఆఫీసుకు విచారణ పేరుతో పిలిచి హడావుడికి తెరదీశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు భారీగా అనుచరులతో శుక్రవారం విచారణకు తరలివెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాల కార్యక్రమం జరిగింది. అప్పటి రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు అప్పటి విప్ ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అప్పటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన అనుచరగణంతో సమావేశం వద్దకు వచ్చి వివాదం సృష్టించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరు వర్గాలకూ సర్దిచెప్పారు. 2024 డిసెంబర్ 13న టీడీపీ కార్యకర్త తాడి శశిధర్ పేరిట మంత్రి నిమ్మల రామానాయుడు అప్పటి ఘటనపై ఫిర్యాదు చేయించారు. నిమ్మల రామానాయుడును స్టేజీ మీదకు రానీయకుండా గెంటిపడేశారని, ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావును స్టేజీ పైకి వెళ్ళనీయకుండా నిరోధించి చేతులు, కాళ్ళతో తన్నుతూ ఉండగా తాను రక్షణగా నిలబడ్డానని, తనను ఉద్దేశించి కులం పేరుతో దూషించారని మొత్తం 24 మందిపై ఫిర్యాదు చేశారు. వెంటనే పాలకొల్లు టౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 2022లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు హైకోర్టులో బెయిల్ తీసుకున్నారు. మిగిలినవారందరూ పోలీస్ స్టేషన్‌లో 41 నోటీసులు తీసుకుని బెయిల్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో నడుస్తోంది. విచారణకు వైఎస్సార్‌సీపీ నేతలందరూ హాజరవుతున్నారు.
మంత్రి నిమ్మల ప్రోద్బలంతో కేసును కొద్ది నెలల క్రితం సీఐడీకి అప్పగించారు. దానికనుగుణంగా స్థానికంగా టీడీపీ కార్యకర్తతో ఫిర్యాదు చేయించడం, పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రభుత్వం జోక్యంతో సీఐడీకి అప్పగించి ఒక్కొక్కరిని విచారణకు పిలిచి తమకు కావాల్సిన సమాధానం వచ్చేలా ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు 10 మందికి నోటీసులిచ్చి రోజుకొకరిని పిలిచి వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు బండి రమేష్‌ను ఈ నెల 1న, యడ్ల తాతాజీని 2న, ఖండవల్లి వాసును 3న, మానుకొండ శ్రీనివాస్‌ను 4న రాజమండ్రి సీఐడీ ఆఫీసుకు విచారణకు హాజరయ్యేలా నోటీసులిచ్చి విచారించారు. 5న పార్టీ నేత గుణ్ణం నాగబాబును విచారించారు. 8న గవర సర్వేశ్వరరావును, 9న కోట రత్నరాజు, 10న చందక సత్యనారాయణ, 11న ఉచ్చుల స్టాలిన్ బాబు, 12న లింకే శ్రీను హాజరుకావాలని నోటీసులు జారీ చేసి వేధింపుల పర్వానికి షెడ్యూల్ రూపొందించడం గమనార్హం.
2022లో జరిగిన ఘటనపై సీఐడీ కేసు
కోర్టులో కేసు కొనసాగుతున్నా
అత్యుత్సాహంగా సీఐడీ జోక్యం
10 మంది వైఎస్సార్‌సీపీ నేతలు,
కార్యకర్తలకు నోటీసులు
రోజుకొకరిని విచారణకు పిలిచి హడావుడి
మంత్రి నిమ్మల వేధింపుల పర్వం


