అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు

Nov 28 2025 7:09 AM | Updated on Nov 28 2025 7:09 AM

అక్రమ

అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు

అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు లింగ వర్గీకృత వీర్యం ద్వారా అధిక పాల దిగుబడి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: భీమడోలు మండలం పొలసానిపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగుల్లోకి తీసుకుని వస్తున్నందున తనపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్‌, వైఎస్సార్‌ సీపీ నేత అంబటి నాగేంద్రప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురురవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల గ్రామంలోని చెరువులోని మట్టి, గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారని తాను సంబంధిత అధికారులకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశానని వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు విచారణ చేస్తుండడంతో పంచాయతీ పాలకవర్గంలోని ఇద్దరు సభ్యులు బుధవారం తన సొంతింటి శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. శంకుస్థాపన నిలిపేయడంతో ఆహ్వానించుకున్న బంధువులు, పెద్దలు వెనుతిరిగి వెళ్లిపోయారన్నారు. శంకుస్థాపనను అడ్డుకున్న వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.

పెంటపాడు: లింగ వర్గీకృత వీర్యం ద్వారానే అధిక పాల దిగుబడితో పాటు, పశుసంతతి అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని రైతులకు తెలపాలని జిల్లా పశుసంవర్థక శాఖ డీఏహెచ్‌ఓ కోటిలింగరాజు పేర్కొన్నారు. గురువారం పెంటపాడులోని పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీ కార్యాలయంలో పశుపాలన డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌కే సుధాకర్‌ ఆధ్వర్యంలో త్రైమాసిక సమావేశం, రివ్యూతో పాటు, పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి లింగరాజు మాట్లాడుతూ ఇప్పటివరకు పశువులకు ఇస్తున్న సాంప్రదాయ సెమన్‌ స్థానం అధికమించి, కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా కేవలం పశు ఆడదూడలు జన్మించే విధంగా లింగ వర్గీకృతవీర్యం (సెక్సర్‌సెమన్‌) పశువులకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విధంగా జిల్లాలో ఇప్పటివరకు 1345 డోసులు అందించామని, మరో 3,800 డోసులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో సిబ్బంది పనితీరు, లక్ష్యాలు, రాబోయే మూడు నెలలలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో సమీక్షించారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు(మెట్రో): డిసెంబర్‌ 1న ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్ల పంపిణీ, బంగారు కుటుంబాలను కలిసి, మార్గదర్శకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉందన్నారు. గొల్లగూడెం, గోపీనాథపట్నంలలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్‌, సభాస్థలి ప్రాంతాలను అధికారులు పరిశీలించి, ఏర్పాట్లకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ, జిల్లా పరిషత్‌ సీఈఓ శ్రీహరి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్‌ అంబరీష్‌ పాల్గొన్నారు.

అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు 1
1/1

అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement