రైతన్నా.. మీకోసం సద్వినియోగం చేసుకోవాలి
పాలకోడేరు: రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే రైతన్నా మీకోసం కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని దీనిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ శ్రీరైతన్న మీకోసం్ఙ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి సమక్షంలో నిర్వహించారు. పెంకుటిల్లు అరుగుపై ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో కలిసి కలెక్టర్ అరుగుపై కూర్చుని ముఖాముఖి మాట్లాడారు. రైతులు సాధక బాధకాలను, వరి పంట సాగులో వారి అనుభవాలను వివరించారు. కలెక్టర్ రైతులతో ముచ్చటిస్తూ ప్రతి ఒక్క రైతు ఇంటికి వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు వచ్చి వ్యవసాయ సాగులో అనువైన పద్ధతులు సేంద్రియ వ్యవసాయం, అగ్రిటెక్ తదితర వివరాలను తెలియజేస్తారని చెప్పారు. ఉన్న పొలంలో కొంతమేర ఆర్గానిక్ కూరగాయలను పండిస్తే మార్కెటింగ్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ప్రకటించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


