చరిత్రను మర్చిపోతే మనుగడ ప్రశ్నార్థకం
భీమవరం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను స్మరించుకోకుండా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోలేమని 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన న్యాయ అవగాహనా సదస్సులో ఆయన విశిష్ట అతితిగా హాజరై మాట్లాడారు. చరిత్రను మర్చిపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, భారత రాజ్యాంగం గురించి అంబేడ్కర్ గురించి వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శించేవారు ఆయన జీవిత చరిత్రను చదివి తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన విద్య, స్వేచ్ఛ, సమానత్వం వంటి హక్కులు అట్టడుగనున్నవారికి గుర్తింపును కల్పించాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్, జిల్లా రెవిన్యూ అధికారి బి.శివన్నారాయణరెడ్డి, డీఎస్పీ బి.విశ్వనాథ్ , సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.హనీష, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి ఎన్‌వీ.అరుణకుమారి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండవల్లి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
3వ అదనపు జిల్లా జడ్జి బి.లక్ష్మీనారాయణ


