వరిపై మానుపండు తెగులు
గతంలో ఎప్పుడూ లేదు
భీమవరం: సార్వా సీజన్ ప్రారంభం నుంచి రైతులను కష్టాలు చుట్టుముడుతున్నాయి. వరి కంకుల్లో పసుపు రంగులో సుద్దలు, సుద్దలుగా మానుపండు వ్యాపించడంతో గింజలు తప్పలుగా మారి తీవ్ర నష్టం కలుగుతుందని వాపోతున్నారు. పైరు ఈనిక, పాలుపోసుకునే దశలో ఉన్న ప్రాంతాల్లో వర్షాల కారణంగా పుప్పొడి రాలిపోవడం, మానుపండు తెగులు సోకడం రైతన్నలకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. పుప్పొడి రాలిపోవడంతో ఎక్కువ గింజలు తప్పలుగా మారిపోయి దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానుపండు తెగులుతో గింజ రాలిపోవడంతోపాటు గట్టిదనం లోపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. మానుపండు తెగులు చేనులోనికి దిగగానే పసుపు వంటి పౌడర్ పడుతుందని, దీనికి వల్ల రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
మానుపండు తెగులు కారణంగా ధాన్యం ఎడెనిమిది బస్తాల తగ్గిపోయే ప్రమాదముంది. వర్షాల కారణంగా గింజలు తప్పలుగా మారిపోతున్నాచి. మానుపండు తెగులు గోరుచుట్టుపై రోకలిపోటుగా పరిణమించింది. మొత్తం మీద సార్వా పంట తీవ్ర నష్టాలు కలిగించింది.
– వంగూరి రత్తయ్య, రైతు పంజా వేమవరం
అక్టోబర్‌లో వర్షాలు కారణంగా మానుపండు ఆశించింది. ఈనిక దశలో ఉన్న పైరుపై వర్షాల వల్ల పుప్పొడి రాలిపోయి తప్పలుగా మారే అవకాశముంది. మానుపండు నివారణకు టిల్ట్ మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
– జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి
సార్వా ఈనిక దశలో ఉండగా వర్షాల కారణంగా మానుపండు తెగులు ఎక్కువగా ఆశించింది. గతంలో ఎన్నడూలేని విధంగా మొత్తం కంకులకు తెగులు కనబడుతోంది. దీని నివారణకు మందులు లేవని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. దీనివల్ల దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది.
– కాపకాయల సత్యనారాయణ, రైతు, వేమవరం
వరిపై మానుపండు తెగులు
వరిపై మానుపండు తెగులు
వరిపై మానుపండు తెగులు


