మద్దిలో కార్తీక సోమవారం పూజలు
జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామికి లక్ష తమలపాకులతో శ్రీవార్షికశ్రీ లక్షార్చన కార్యక్రమం ఆలయ అర్చకులు, వేదపండితులు, రుత్విక్‌లు వైభవంగా నిర్వహించినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. వివిధ సేవల రూపేణా రూ.1,56,400 విరాళంగా సమకూరినట్లు ఈవో తెలిపారు.
భీమవరం: వయసు మళ్లిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. ఆస్తి దస్తావేజు వయోవృద్ధుల మనోవర్తి చట్టం ప్రకారం రద్దు చేస్తారని భీమవరం 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలోని సన్‌రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో సోమవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పిల్లలకు చిన్నతనం నుంచే పెద్దవారి పట్ల ప్రేమ, ఆప్యాయతలను తెలియజేస్తూ పెంచాలన్నారు. అనంతరం వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు పి.అంబేద్కర్, ఎన్.సుధీర్, బి.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు నిచ్చారు. వన్‌టౌన్ దక్షిణపు వీధికి చెందిన టేకి శివరామకృష్ణ గంగాధరాచారి కుటుంబం నగరానికి చెందిన ఎం.సుధాకరరెడ్డి వద్ద 2022లో రూ.6 లక్షలు అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చే నిమిత్తం 2023 జనవరిలో రూ.4.80 లక్షల చెక్కును సుధాకరరెడ్డికి ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. సుధాకరరెడ్డి కోర్టులో కేసు వేశారు. చెల్లని చెక్కు ఇచ్చిన నేరం రుజువైనందున గంగాధరాచారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. అలాగే రూ.4.80లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
పెనుగొండ: దొంగరావిపాలెంలో విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ ఎస్సై గంగాధర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రావులపాలెం వైపు వెళ్తున్న బొలేరో వాహనంలో అక్రమంగా 58 బస్తాలు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
మద్దిలో కార్తీక సోమవారం పూజలు


