క్షేత్రపాలకుడి ఆలయంలో భక్త సంద్రం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శివదేవునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని సుగంధ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు, శివ దీక్షాదారులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, పూజాధికాలను జరుపుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని ఉసిరిచెట్ల వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ గర్భాలయంలో శివయ్యకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ క్షీరాభిషేకాలు నిర్వహించి, హారతులిచ్చారు. రాత్రి గంగా, పార్వతీ సమేత శివయ్య శేష వాహనంలో క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, నీరాజనాలు సమర్పించారు.
క్షేత్రపాలకుడి ఆలయంలో భక్త సంద్రం


