
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. వచ్చే నెల 3 నుంచి మున్సిపల్ కార్మికులు చేపట్టనున్న సమ్మె సన్నాహాల్లో భాగంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సమ్మె విరమణ సందర్భాల్లో ప్రభుత్వం కార్మికులకిచ్చిన హామీలు అమలు జరగడంలేదని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, జీఓ 151 అమలు కావడంలేదని దుయ్యబట్టారు. ఆప్కాస్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి రూ.36 వేలు కనీసం వేతనం, తడి, పొడి చెత్త, క్లీన్ అండ్ గ్రీన్ కార్మికులకు కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన, పదవీ విరమణ చేసిన అవుట్ సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, 12వ పీఆర్సీ ప్రకటించి 30 శాతం ఐఆర్ ఇవ్వాలని, పెరిగిన జనాభా కనుగుణంగా కార్మికుల నిష్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఆకివీడు: రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలని, రాష్ట్రంలోని కూటమి నాయకులు మోదీని పొగడడం కాకుండా రాష్ట్రానికి నిధులు అడగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల వల్ల రాష్ట్రంలో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులకు, వ్యవసాయ రైతులకు నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీతో ఇప్పటికే రూ.60 లక్షల కోట్లు ముక్కుపిండి వసూలు చేశారని జీఎస్టీ తగ్గింపంటూ సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సబబని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని ఎప్పుడు వచ్చినా ఒట్టి చేతులతోనే వస్తున్నారని ఈ పర్యటనలోనైనా రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయింపుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వి గోపాలన్, కేతా గోపాలన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు తదితరులు పాల్గొన్నారు.
ఉండి: ఐదు రోజుల అనంతరం ఉండి రైల్వే గేటు తెరుచుకుంది. ఉండిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్(ఆర్‌ఓబీ)పనుల నిమిత్తం జాతీయ రహదారిపై ఉన్న ఉండి రైల్వే గేటును ఈ నెల 10న మూసి వేశారు. 15వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి గేటును తెరిచి రాకపోకలకు అనుమతించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా పరిధిలో పరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్‌లో విస్తృత కార్యక్రమాలు ప్రారంభించామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ గోడ పత్రికను విడుదల చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి