
ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యం
ఆకివీడు: నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని, ప్రభుత్వ కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం, స్పిరిట్, వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరకడం దారుణమన్నారు. కుటీర పరిశ్రమగా మద్యం తయారీని కూటమి ప్రతినిధులే చేపట్టడం దారుణమన్నారు. నకిలీ మద్యం తయారీ వల్ల వేల కుంటుంబాలు వీధిపాలవుతున్నాయన్నారు. నకిలీ మద్యం తయారీని అరికట్టకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. తొలుత ర్యాలీ నిర్వహించి నకిలీ మద్యం తయారీ అరికట్టాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రమేష్, గుండా సుందర రామనాయుడు, జీ.ధనరాజు, నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు గేదల అప్పారావు, దొడ్డి జగదీష్, ఎండీ. ఆలీ, ఎండీ.జక్కీ, గుండుగొలను సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్