
నకిలీపై నిరసనాగ్రహం
న్యూస్‌రీల్
ఆస్పత్రి పూర్తయ్యేదెప్పుడు?
గత ప్రభుత్వంలో మంజూరైన ఆస్పత్రి పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిలిచిపోయాయి. ఎప్పటికి పూర్తిచేస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. IIలో u
నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. కూటమి నేతల ధనదాహానికి ఇంకెన్ని కుటుంబాలు బలికావాలంటూ ధ్వజమెత్తారు. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో మంగళవారం భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
తణుకు అర్బన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ తణుకు డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. యాజమాన్యం కొత్తగా పెట్టిన పని భారం, పెరిగిన రెస్ట్ ఆఫ్ డ్యూటీలు, ఇన్ కమింగ్ టైం, కిలోమీటర్లు తగ్గించాలని, డ్రైవర్ గారపాటి రామారావుపై విధించిన అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, బస్సుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, డిపోలోని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షలో తణుకు డిపో డ్రైవర్‌లు డి.రాంబాబు, ఎం.జగన్నాధరాజు, పి.వెంకట నాగసుబ్రమణ్యం, వి.రాంబాబు, జి.రామారావు కూర్చున్నారు. అసోసియేషన్ డిపో సెక్రటరీ బి.సుబ్బారావు, అధ్యక్షుడు ఎస్.ఏసుబాబు, డిపో చైర్మన్ టి.శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్, బహుజన సమాజ్ నాయకులు పాల్గొన్నారు.
భీమవరం: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం విజ్ఞప్తి చేసింది. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో భీమవరం డివిజన్ అధ్యక్షుడు విప్పర్తి బోసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్కం అధ్యక్షుడు జె శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మాటలు చెప్పడమే కానీ ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ మాదిరిగా సంస్థలను విలీనం చేసి వారికి రూ.46 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దని కోరుతూ ఇచ్చిన సమ్మె నోటీసుపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని వారు తప్పుపట్టారు. ట్రేడ్ యూనియనన్ స్ట్రగుల్ కమిటీ నాయకత్వంలో ఇప్పటికే సమ్మెకు సిద్ధం చేశామని, పవర్ జేఏసీ కూడా సమ్మె నోటీస్ ఇచ్చిందని వారు పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మిక విద్యుత్ ఉద్యోగ నాయకులు పాండురంగరాజు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలోని పాలకొల్లులో మంగళవారం అత్యధికంగా 109.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలో 42.2, కాళ్లలో 40.4, వీరవాసరంలో 36.8, యలమంచిలిలో 29.2, నరసాపురంలో 14.6, మొగల్తూరులో 18.4, పోడూరులో 20.2, పెనుగొండలో 9.8, ఇరగ వరంలో 10.4, ఆచంటలో 18.6, తాడేపల్లిగూడెంలో 6.6, పెంటపాడులో 6.2, తణుకులో 6.6, అత్తిలిలో 15.4, గణపవరంలో 67.2, ఆకివీడులో 51, ఉండిలో 75.8, పాలకోడేరులో 22.2, పెనుమంట్రలో 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
సాక్షి, భీమవరం: నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు కదంతొక్కారు. నకిలీ మద్యాన్ని ఎరులై పారిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి నేతల తీరుకు నిరసగా మంగళవారం తాడేపల్లిగూడెం, ఆచంట, భీమవరం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అమాయకుల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా లని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నినదించారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా బాబుకు లెక్కలేదు..
నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో ఆయన నేతృత్వంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, స్థానికులు పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ధనార్జనే ప్రాధాన్యం అన్నట్టుగా నకిలీ మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. కూటమి పాలనలో నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమగా తయారైందని మండిపడ్డారు. నకిలీ మద్యం సేవించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది మృతిచెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అర్బన్, రూరల్, పెంటపాడు కన్వీనర్లు కొలుకులూరి ధర్మరాజు, జడ్డు హరిబాబు, కై కాల శ్రీనివాస్, బూత్ కమిటీల కన్వీనర్ కర్రి భాస్కరరావు, మహిళా కన్వీనర్ బోణం విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
సీబీఐ విచారణ చేయించాలి..
రాష్ట్రంలో వెలుగుచూసిన నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో భీమవరంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. భీమవరం రూరల్ రాయలం నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కల్తీ మద్యాన్ని అరికట్టాలని కోరుతూ ఎకై ్సజ్ సీఐ బలరామరాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వెంకటరాయుడు మాట్లాడుతూ నాణ్యత లేని మద్యం సేవించి కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, ఆనారోగ్య సమస్యలతో ఎంతోమంది ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. నకిలీ మద్యం వల్ల రాష్ట్రంలో మరణాలు పెరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. నెపాన్ని ప్రతిపక్ష పార్టీపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ చిగురుపాటి సందీప్, భీమవరం అర్బన్, వీరవాసరం మండల అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవ్వాకుల సత్యనారాయణ, రాష్ట్ర మహిళ కార్యదర్శి పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు.
ఆచంటలో జోరువానలో నకిలీ మద్యంపై నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, పార్లమెంటు పరిశీలకుడు మురళీకృష్ణంరాజు, పార్టీ శ్రేణులు
కల్తీ మద్యం విక్రయాలకు నిరసనగా రాయలం గ్రామం నుంచి ర్యాలీగా వస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఆరేడు ప్రాంతంలో రోడ్డుపై పడిన పెద్ద పెద్ద గుంతలు
కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
భీమవరం, ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో నిరసనలు
ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన
నకిలీ మద్యాన్ని అరికట్టాలని అధికారులకు వినతులు
రోడ్లన్నీ గుంతలమయం
చినుకు పడితే చెరువుల్లా రహదారులు
గుంతలు కనిపించక ప్రమాదాల పాలవుతున్న జనం
తుక్కుతుక్కవుతున్న వాహనాలు

నకిలీపై నిరసనాగ్రహం

నకిలీపై నిరసనాగ్రహం

నకిలీపై నిరసనాగ్రహం

నకిలీపై నిరసనాగ్రహం

నకిలీపై నిరసనాగ్రహం

నకిలీపై నిరసనాగ్రహం