మరమ్మతులు చేపట్టాలి
వెంటనే గుంతలు పూడ్చాలి
ఉండి: అవునండీ.. ఆ రోడ్లపై వెళితే.. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఆదమరిస్తే అంతే సంగతులు. రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని గుంతలమయం కావడమే దీనికి కారణం. ఇక చినుకు పడిందంటే.. రోడ్లన్నీ నీటితో నిండి చెరువులుగా మారుతున్నాయి. ఆ నీటిలో గుంతలు కనిపించక ప్రమాదాల పాలవడం ఖాయం. ఈ పరిస్థితి ఉండి నియోజకవర్గంలోని అనేక రహదారుల్లో నెలకొని ఉండటం గమనార్హం. ప్రధానంగా ఉండి మండలంలో జాతీయ రహదారి(165, పీపీ రోడ్డు), ఉండి – గణపవరం రోడ్డు, గరగపర్రు – తాడేపల్లిగూడెం రోడ్డు, కాళ్ళ మండలంలో జువ్వలపాలెం రోడ్డు, ఆకివీడు మండలంలో జాతీయ రహదారితో పాటు పెదకాపవరం రోడ్డు, చినమిల్లిపాడు – సిద్దాపురం రోడ్డు, కప్పనపూడి రోడ్డు, ఆకివీడు, ఐ.భీమవరం మీదుగా ఏలూరుపాడు రోడ్డు, కాళ్ళ మండలంలో బోస్ కాలనీ, పాతళమెరక, బొండాడ, కోపల్లె ఇలా మొత్తం అన్ని రోడ్లూ దెబ్బతినడంతో ప్రయాణికులు, వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఇక వర్షం వస్తే ఈ రహదారులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన పనుల్లో ఏమాత్రం నాణ్యత ఉందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.
రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రమాదాలు జరిగితే ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలి.
– గొంతే హరీష్, వాహనదారుడు, పాందువ్వ
నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు తిరిగే గణపవరం రోడ్డు లో ఇంత పెద్ద గుంతలు పడినా ప్రజాప్రతినిధులు, స్పందించ డం లేదు. ఇప్పటికై నా గుంతలను పూడ్చాలి. ప్రమాదాలను నివారించాలి.
– వర్రే పైడియ్య, మాజీ ఎంపీటీసీ, పాములపర్రు
ఆదమరిచారో.. అంతే సంగతులు!
ఆదమరిచారో.. అంతే సంగతులు!