ఆపదలో ఆరోగ్యశ్రీ | - | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆరోగ్యశ్రీ

Oct 11 2025 9:28 AM | Updated on Oct 11 2025 9:28 AM

ఆపదలో

ఆపదలో ఆరోగ్యశ్రీ

పశ్చిమలో మద్యం దందా

న్యూస్‌రీల్‌

కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన

పశ్చిమలో మద్యం దందా
ఉమ్మడి పశ్చిమలో మద్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. వీధివీధికీ బెల్టుషాపులు, ఎమ్మార్పీకి మించి అధిక ధరలతో దోపిడీ కొనసాగుతోంది. 8లో u

శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: పేద, మధ్యతరగతి వర్గాలకు అపర సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ) పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రూ.కోట్లల్లో బకాయిలు పేరుకుపోయి ముందుకు సాగలేని పరిస్థితుల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 30 ఆస్పత్రులకు 26 చోట్ల సేవలు నిలిచిపోయి రోగుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

పశ్చిమలో 30 ఆస్పత్రులు

జిల్లాలోని 30 వరకు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. వీటిలో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండగా, ఆర్థో, కన్ను, చెవి ముక్క తదితర కేటగిరీ ఆస్పత్రులు 28 ఉన్నాయి. రోజుకు సుమారు 1,500 వరకు ఓపీ నమోదవుతుండగా ఇన్‌ పేషెంట్లుగా చేరేవారు 500 వరకు ఉంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్‌ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైద్యసేవలకు ఆటంకం రాకుండా నిరంతరం అందిస్తూ వచ్చారు. రోగి కోలుకునే వరకూ కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరాగా అవసరమైన ఆర్థ్ధిక సాయాన్నీ అందించేవారు. కాగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఎసరుపెడుతోంది. ఆరోగ్య ఆసరాను నిలిపివేయడంతో పాటు ఆస్పత్రులకు బకాయిల విడుదలకు తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్‌లోనూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి.

జిల్లాలోని 34 రూరల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 74 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. సర్వీస్‌లోని పీహెచ్‌సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలని, టైం బాండ్‌ ప్రమోషన్స్‌ కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్‌ ఇవ్వాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేల అలవెన్స్‌ ఇవ్వాలని, కౌన్సెలింగ్‌ విషయంలో అర్బన్‌ అండ్‌ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదేళ్లకు కుదించుట, నేటివిటీపై స్పష్ట త కావాలని కోరుతూ రెండు వారాలుగా ఆందో ళనను కొనసాగిస్తున్నారు. ఏరియా, సీహెచ్‌సీల నుంచి రూరల్‌ పీహెచ్‌సీలకు వైద్యులను సర్దుబాటు చేస్తున్నా అటు ప్రధాన ఆస్పత్రులు, ఇటు రూరల్‌ పీహెచ్‌సీల్లోనూ పూర్తిస్థాయిలో వైద్యసేవలందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేదవర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అపర సంజీవనికి గ్రహణం

ప్రభుత్వం బిల్లులివ్వక సమ్మెలోకి నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రుల్లో సేవలు బంద్‌

గాల్లో దీపాల్లా రోగుల ప్రాణాలు

ఇప్పటికే సమ్మెలో పీహెచ్‌సీ వైద్యులు

అగమ్యగోచరంగా పేదల పరిస్థితి

ఆపదలో ఆరోగ్యశ్రీ 1
1/1

ఆపదలో ఆరోగ్యశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement