
ఏలూరు జిల్లాలో రూ. 60 కోట్ల బకాయిలు
సాంకేతికతపై పట్టు సాధించాలి
విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ అన్నారు. నిట్‌లో టెక్రియా 2కే25 ప్రారంభమైంది. 8లో u
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చికిత్సలు, శస్త్రచికిత్స లు అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.60 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఆస్పత్రి యాజమాన్యాలు ఉచిత సేవలకు నిరాకరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో సేవలను నిలిపివేయాలని నిర్ణయించటంతో దాని ప్రభావం పేద, మద్యతరగతి వర్గాల ప్రజలపై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏలూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ 32 వరకు ఉన్నాయి. అయితే వీటికి బకాయిల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఏలూరు నగరంలో మూడు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. మిగిలిన హాస్పిటల్స్ సైతం మెల్లగా సేవలను నిలిపివేసేందుకు చూస్తున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్‌కు సుమారుగా రూ.60 కోట్ల మేర భారీగా బకాయిలు పేరుకుపోయినట్టు చెబుతున్నారు. ఒక్కో హాస్పిటల్‌కు సుమారుగా రూ.50 లక్షల నుంచి రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు తెలిసింది. చిన్న హాస్పిటల్స్‌కు బిల్లు బకాయిలు భారంగా మారటంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు శివారులోని ఒక హాస్పిటల్‌కి అయితే ఏకంగా రూ.20 కోట్ల వరకూ బకాయి ఉన్నట్టు సమాచారం. ఒక మిషనరీ సంస్థ హాస్పిటల్‌కు సైతం రూ.5 కోట్లకు పైగా బకాయి ఉందని చెబుతున్నారు.