
ఎమ్మెల్యే పితానివి తప్పుడు ఆరోపణలు
పెనుమంట్ర: పెనుమంట్ర గ్రామ అభివృద్ధి వి షయంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆచంట ఎమ్మె ల్యే పితాని సత్యనారాయణ తమపై గ్రామసభలో తప్పుడు ఆరోపణ చేశారని పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రి యాంక, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ధ్వజమెత్తారు. శుక్రవారం పెనుమంట్రలో విలేకరులతో మాట్లాడుతూ గురువారం జరిగిన గ్రామసభలో పితాని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంతో గౌరవం ఇస్తున్నామని చెప్పుకుంటున్న పితాని.. సభా మర్యాద లేకుండా మహిళా సర్పంచ్‌గా తనకిచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. బ్రాహ్మణచెరువులో ఓహెచ్‌ఆర్ వాటర్ ట్యాంక్ మరమ్మతులకు కలెక్టర్ ఉత్తర్వులు మేరకు గతేడాది తీర్మానం చేశామని, అయితే ఎమ్మెల్యే పితాని సర్పంచ్ తీర్మానం చేయలేదని గ్రామసభలో చెప్పడం సరికాదన్నారు. అలాగే ఆగస్టులో పంచాయతీ ఆవరణలో జరిగిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడిన తహసీల్దార్‌పై తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. పంచాయతీలో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు కూటమి నాయకులు అధికారులను బెదిరించి దౌర్జన్యంగా వేదికపైకి వచ్చి కూ ర్చుంటున్నారని, దీంతో తాను గురువారం జరిగిన గ్రామ సభకు అధ్యక్షత వహించడానికి నిరాకరించానన్నారు. గ్రామ అభివృద్ధి పనులకు కొందరు కూటమి నేత లు అడ్డుపడుతుండగా.. ఎమ్మెల్యే పితాని వారికి వత్తాసు పలుకుతూ తనపై, తన వార్డు సభ్యులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు, పంచాయతీ బోర్డు సభ్యులు కొవ్వూరి నాగమోహన రాజారెడ్డి, తేతల ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.