ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత

Oct 9 2025 2:41 AM | Updated on Oct 9 2025 2:41 AM

ఎట్టక

ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత

ఆగిరిపల్లి: మండలంలోని నూగొండపల్లి వద్ద ఉన్న కుంపిని వాగు పై ఉన్న కల్వర్టు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. ఈ దుస్థితిపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘ప్రమాదకరంగా కల్వర్టు’ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు కల్వర్టుపై ఏర్పడిన గుంతులను బుధవారం కంకరరాళ్లతో పూడ్పించారు.

రేపటి నుంచి నిట్‌లో

టెక్రియా 2కే25

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో టెక్రియా 2కే25 సన్నాహక కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. శుక్రవారం, శనివారాల్లో రెండు రోజులపాటు టెక్రియా జరుగనుంది. బుధవారం కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిట్‌ రిజిిస్ట్రార్‌ దినేష్‌ శంకరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అసోసియేట్‌ డీన్‌ రాజేశ్వర్‌రెడ్డి, కో ఆర్డినేటర్‌ సారధ్యంలో విద్యార్థులు నృత్యాలు చేశారు. టెక్రియాలో రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, అల్టిమేట్‌ డ్రోన్‌, డ్రోన్‌ చాలెంజ్‌, సెరెనిటీ రూమ్‌, ఇంజనీర్స్‌ డ్రైవ్‌ వే , రిథమ్‌ రియాల్టీ, షేర్‌ లాక్డ్‌, షార్ట్‌ఫిలిం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నిట్‌ అధికారులు కె.హిమబిందు, శ్రీనివాసన్‌, టి.రమేష్‌ పాల్గొన్నారు.

ఏలూరు జీజీహెచ్‌లో డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని పలు విభాగాలను డాగ్‌స్క్వాడ్‌ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. జీజీహెచ్‌లోని అత్యవసర సేవల విభాగం వైపు నుంచీ లోపల ఎమర్జెన్సీ వార్డులు, ఇతర విభాగాల్లోనూ తనిఖీలు చేశారు. జీజీహెచ్‌ ప్రాంగణంలోనూ, అన్ని విభాగాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీనిపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే ఏలూరు జీజీహెచ్‌లోనూ డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టామని తెలిపారు.

ఎట్టకేలకు కల్వర్టుపై  గుంతల పూడ్చివేత 
1
1/3

ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత

ఎట్టకేలకు కల్వర్టుపై  గుంతల పూడ్చివేత 
2
2/3

ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత

ఎట్టకేలకు కల్వర్టుపై  గుంతల పూడ్చివేత 
3
3/3

ఎట్టకేలకు కల్వర్టుపై గుంతల పూడ్చివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement