
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక
పెదవేగి: ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్ల ఎంపికలు బుధవారం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్‌సీ కాలనీలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, కోకో, త్రోబాల్, బాల్‌బాట్‌మింటన్, చెస్, యోగాసన, మొదలైన ఆటల పోటీలు నిర్వహించి, జిల్లా జట్లను ఎంపిక చేశారు. సుమారు 480 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, జిల్లా కార్యదర్శి కె.జయరాజు, హేళాపురి ఇంజనీరింగ్ కళాశాల ఏఓ కరుణానిధి, పీడీలు రాజా, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక