
ఉద్యాన పంటల్లో సస్యరక్షణ
అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 8లో u
● పాలకొల్లు పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, బస్టాండ్ సెంటర్, సలాదివారి తోట, బంగారువారి చెరువుగట్టు, బ్రాడీపేట తదితర చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. బస్టాండ్‌లో మోకాలులోతు నీటితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
● పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడడంతో రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. పెనుగొండ, గటాలదిబ్బ, సిద్ధాంతంలో జగనన్న కాలనీలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
● ఇరగవరం మండలంలో కత్తవపాడులోని ఎస్సీ కాలనీ, రేలంగిలోని ఇందిరానగర్‌లు జలమయమయ్యాయి. ఇరగరవరం మెయిన్‌రోడ్డులో డ్రెయినేజీ పనులు జరుగుతుండంతో ఇళ్ల ముందు వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇరగవరం గొంతేరు డ్రెయిన్‌లో గరిగమ్మలకాలువ, పేకేరులో నక్కల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి.
● తాడేపల్లిగూడెంలో తెల్లవారుజామునుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా 62.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీని వల్ల పట్టణంలోని రహదారులు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ప్రాంతాల్లోని వరికోతలకు విఘాతం ఏర్పడింది.