
కుండపోత వాన
న్యూస్‌రీల్
సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. 8లో u
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఎడతెరిపిలేకుండా కుండపోతగా వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా 41.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 62.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా పడుతూనే ఉంది. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. తాడేపల్లిగూడెం, ఆచంట, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో భారీగా మిగిలిన చోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. పెనుమంట్ర ప్రాంతంలో 59.4 మి.మీ వర్షం కురవగా, ఇరగవరంలో 48.6, గణపవరంలో 36.4, పెంటపాడులో 35.6, భీమవరం, ఉండిలో 25.6 మి.మీ చొప్పున, తణుకులో 24.4, పెనుగొండలో 21.2, అత్తిలిలో 13.2 మి.మీ వర్షం కురిసింది. తెరిపివ్వకుండా వర్షం పడడంతో అధిక శాతం మంది ఇళ్లకే పరిమితం కాగా విద్యాసంస్థలు, ఆఫీసులకు వెళ్లేవారు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జనం లేక మార్కెట్లు వెలవెలబోయాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆర్టీసీ బస్టాండుల వద్ద మోకాలు లోతు నీటితో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రోడ్లపై గోతులు కనిపించక పలుచోట్ల ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలు పాలయ్యారు.
భీమవరంలో నీట మునిగిన రోడ్లు
భీమవరంలో ఉదయం 6 గంటలకు వర్షం చినుకులుగా ప్రారంభమై తరువాత సుమారు మూడు గంటల పాటు ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, బ్యాంక్ కాలనీలు, ఏఎస్‌ఆర్ నగర్, మెంటేవారితోట, నాచువారిసెంటర్, గునుపూడి, ఫైర్‌స్టేషన్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా రోడ్ల పక్కన తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుని జీవించే చిరువ్యాపారులు నష్టపోయారు. పట్టణంలోని గరగపర్రురోడ్డు, మెంటేవారితోట, ఎఫ్‌సీఐ తదితర ప్రాంతాల్లోని రైల్వే అండర్‌పాస్‌ల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వీరవాసరం – వడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై రెండు భారీ వృక్షాలు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు గాలికి ఒరిగిపోయారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
స్తంభించిన జనజీవనం
జిల్లాలో 20 మి.మీ వర్షపాతం నమోదు
అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 62.4 మి,మీ వర్షం

కుండపోత వాన