
ట్రిపుల్ ఐటీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025ను మంగళవారం నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలకు ఈ హ్యాక్‌థాన్ వేదికై ంది. ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఈ హ్యాకథాన్‌లో 185 జట్లు పాల్గొని 210 ప్రజంటేషన్లు సమర్పించారు. తమ పాఠ్యాంశాలను మించి యాప్‌లను, ఏఐ ఆధారిత వర్క్‌ఫ్లోలను రూపొందించి జ్యూరీని ఆకట్టుకున్నారు. స్మార్ట్ ఎడ్యుకేషన్, మెడ్‌టెక్, వ్యవసాయం, క్లీన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక ఇంధనాలు, విపత్తు నిర్వహణ వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు తమ ప్రజంటేషన్లను సమర్పించారు. వీటిల్లో నుంచి 50 ఉత్తమ జట్లను జ్యూరీ ఎంపిక చేయనుంది. హాకథాన్ పోటీలు బుధవారం కూడా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో డీన్ ఈఐటీపీ పీ శ్యామ్, శివలాల్, వినోద్, డాక్టర్ దుర్గాబాబు, రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.